@గజల్ మహల్ 01-03..// 567..//
నీవెవరో తెలియకనే.. యుగాలుగా పడిగాపులు..!
నేనెవరో తోచకనే..చిత్రముగా పడిగాపులు..!
నువ్వైతే నవ్వుతావు.. ఎంచక్కా బంగారూ..!
ఆ నవ్వుల కొరకేలే..జన్మలుగా పడిగాపులు..!
జాబిలమ్మ కేమితెలుసు..నీ చెలిమియె దొరకకున్న..
నీ తియ్యని వలపులకై..మధురముగా పడిగాపులు..!
కల'వరించు జ్ఞాపకాల తోటలలో హాయికేమి..?!
నీదు ప్రేమ జల్లులకై..మౌనముగా పడిగాపులు..!
ఇంపు గూర్చు ఇంద్రధనువె..విరహజ్వాల అయ్యేనా..?!
నీ సన్నిధి చేరుటకే..ప్రియములుగా పడిగాపులు..!
'మాధవు'నకు ప్రియసఖివే నీవు కదా..ఓ రాధా..!
నా వేదన తొలగుటకే..సౌఖ్యముగా పడిగాపులు..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు