@గజల్ మహల్-01-04..// 568..//
నువ్వలాగ నవ్వితేనె..మరలమరల సంక్రాంతులు..!
నీ చూపులు సోకితేనె..మధురమధుర సంక్రాంతులు..!
విరహాలను విసిగించే..సుమకోమలి నీవేగా..!
నీ వలపులు రువ్వితేనె..పూలపూల సంక్రాంతులు..!
ముచ్చటైన జాబిలికే..ముచ్చటలను నేర్పు జాణ..!
నీ సొగసులు పంచితేనె..సరససరస సంక్రాంతులు..!
చిలుకపచ్చ సింగారము..లొలికించే ఆమనియే..
మదివనమున నింపితేనె..మకరమకర సంక్రాంతులు..!
సిందూరపు వెలుగులతో..పల్లవించు కడలి అలల..
కుంకుమలను చిందితేనె..వర్ణవర్ణ సంక్రాంతులు..!
ప్రణయజగతి తెలించే..'మాధవ'ప్రియ హే..రాధా..!
నీ వెలుగది అందితేనె..హర్షహర్ష సంక్రాంతులు..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు