595..
చినుకులు చినుకులు..చిలిపిగ నవ్వే.. మధువుల చినుకులు..!
మొలకల ఎదలను..చెలిమిగ మీటే..మధువుల చినుకులు..!
మంత్రాక్షరములు..మలయపవనములు..కలబడు వేళలు..!
మనసుకు మనసును..కలిమిగ ఇచ్చే..మధువుల చినుకులు..!
గుండెల సవ్వడి..ఒకటై పోయే..గూటిని చేరే ముచ్చట..!
చూపుల కలయిక..విరివిగ నిలిపే..మధువుల చినుకులు..!
మబ్బుల దుప్పటి మెరుపుల గుసగుస..తెలిసిన వేమో..?!
గింజను మట్టికి..సఖునిగ చేసే..మధువుల చినుకులు..!
యేరుల దారిని నదిగా మలచగ తపమే చేయును..!
వెన్నెల వీధుల సరసిగ సాగే..మధువుల చినుకులు..!
బృందావనికే అందములలదే సొగసరి జాణలు..!
'మాధవ' హృదికే..సాక్షిగ మిగిలే..మధువుల చినుకులు..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు