602..
పగలు ఎంత అల్లరిదో..రాత్రికెలా..చెప్పాలో..!?
రాత్రి ఎంత తుంటరిదో..పగటికెలా..చెప్పాలో..!?
ఎవరు నీవు అనగానే..ఒక పేరును పలికేవా..!!
పేరు ఎంత చిక్కనిదో..మనిషికెలా..చెప్పాలో..!?
యుద్ధాలను చేస్తున్నది..మనసు ముసుగులోనేగా..!!
వలపు ఎంత మునుపటిదో..మట్టికెలా..చెప్పాలో..?!
ప్రియరాగపు నాదాలకు..మువ్వలెచట ఉంటాయట..!?
ప్రేమ ఎంత తియ్యనిదో..పెదవికెలా..చెప్పాలో..?!
మొగలిపొదల పరిమళాల..మోదాలను కోరేవా..?!
శ్వాస ఎంత వాడనిదో..సాక్షికెలా..చెప్పాలో..?!
'మాధవు'నకు వేణువుగా..కావాలను ఆశకేమి..!!
కాంక్ష ఎంత వీడనిదో..కంటికెలా.. చెప్పాలో..?!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు