620..
నిన్ను గూర్చి నీకు నేను.. తెలుప లేను ప్రాణసఖీ..!
నన్ను పట్టి చూపేందుకు.. గీయలేను ప్రాణసఖీ..!
మదిలోపలి అలజడులకు..సాగరమా ఎక్కడనో..!?
కలహంసల గగనాలను..దాటలేను ప్రాణసఖీ..!
నీ సాయము పొందుకొరకు..ఆరాటము ఈ మనసుకు..!
కలనైనా అసలు కథలు..పలుకలేను ప్రాణసఖీ..!
నీ చూపే చెప్పలేని.. అనురాగపు..ధార సుమా ..!
క్షణమైనా ఆ వెన్నెల..మరువలేను ప్రాణసఖీ..!
అక్షరాల తోటలోన విహరించే మౌన జాణ..!
ఆ పువ్వుల పరిమళాలు..పంచలేను ప్రాణసఖీ..!
మానవునే 'మాధవుని'గ..మలచు చెలీ..నీవెవరో..!?
ఎందుకిలా మొద్దునిదుర..వదలలేను ప్రాణసఖీ..!?
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు