227..
చిరు నవ్వుల కోవెలలో దేవతయే నా ప్రేయసి..!!
మరుమల్లెల తోటలలో పరిమళమే నా ప్రేయసి..!!
నా కలలను నిజం చేయ అనుక్షణం తపియించును..!!
నీలి మబ్బు తరగలలో సుమధనువే నా ప్రేయసి..!!
ఆమె కాలి మువ్వలలో సవ్వడిగా మారుటేల..!!
అక్షరాల వెన్నెలలో జాబిలియే నా ప్రేయసి..!!
ఏ సాగర తీరంలో దొరికేనా పద ముద్రలు..!?
అలవి కాని భావనలో వసంతమే నా ప్రేయసి..!!
విరహమసలు నా ఎదనే చేరనీదు కలనైనా..!!
కలహంసల వీధులలో కాంతి నదే నా ప్రేయసి..!!
'మాధవు'డా..కరుణించర..అని కోరే రాధ కదా..!!
ఈ జన్మల బంధంలో మనసు కథే నా ప్రేయసి..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు