కులపిచ్చితో విర్రవీగి కలత పెట్టిన ఓ కులమా - చూపించు కరోనాకి నీ వీరత్వం
జాత్యాహంకారంతో గర్వించిన ఓ జాతి - చాటిచెప్పు కరోనాకి నీ గొప్పతనం
భాష ద్వేషాలతో భేదాలు సృష్టించిన ఓ భాష - కనపరచు కరోనాకి నీ ప్రతిభ
వర్ణవిభేదాలతో కలహాలు పుట్టించిన ఓ వర్ణమా - వ్యక్తపరచు కరోనాకి విశిష్టత
మతోన్మాదంతో మమతను చెరిపిన ఓ మతమా - వివరించి చెప్పు కరోనాకి నీ మేదోసంపత్తి
కుల మత జాతి వర్ణ భాషలతో నిండిన సమాజమా - అరచి చెప్పు కరోనాకి నీ కంటే మేమే ప్రమాదకరమని
నెలవల సహజ,
చిత్తూరు జిల్లా.