శీర్షిక: మత్తులో చితికిపోతున్న జీవితాలు!
నడిరోడ్డుపై పడిఉన్న దేహాలు
అన్నార్తులు శరణార్థులు కారు వీరు
మత్తుకు బానిసైన అభాగ్యులు
కష్టాల సుడిగుండంలో చిక్కి
బరువెక్కిన గుండెలకు
మత్తు అనే లేపనంతో
స్వాంతన కోరే భ్రమలో...
కడలంత కష్టం మింగేస్తుందని
ప్రేమ అనే మాయలో చిక్కుకున్నారని
మరుపు రాక మనసుని వంచించ లేక
గూడుకట్టుకున్న గుబులు దీపాని ఆర్పలని
దేహాన్ని కుళ్ళ బెట్టుకుంటున్నా పిరికివారు
వేదాంతాన్ని వల్లించే తత్వవేత్తలు!
కన్నవారిని కట్టుకున్న దానిని
కష్టాలు పాలు చేసి
ఉన్నదంతా బూడిదలో పోసి
కనికరం చూపక వీధిపాలు చేసి
అర్ధాంతరంగా అనంతంలో
కలిసిపోయే కొన్ని జీవచ్ఛవాలు!
విలాసాలతో చిందులు వేస్తూ
చెడు స్నేహాలకు బానిసలవుతూ
చీడబట్టిన మొగ్గలాగా
భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసి
అదములైపోతున్న యువకులు
మత్తుకు బానిసలైన భావి పౌరులు!!
జ్యోతి మువ్వల
బెంగళూరు