కపట స్నేహం
పొగుడుతూ ఉంటే- నా మనిషే అనుకున్నా
అభిమానాన్ని చూపిస్తుంటే - నాకు వీరాభిమాని అనుకున్నా
లెక్కలేనన్ని ముద్దులు పెడుతుంటే - అమితమైన ప్రేమ అనుకున్నా
అన్నీ కొనిస్తూ ఉంటే - మంచి మిత్రుడు అనుకున్నా
పైకి ప్రాణ స్నేహితుడు అని అంటుంటే - నిజమే అనుకున్నా
నాకు ప్రతి విషయంలో సలహాలు ఇస్తుంటే - అంతా నా అదృష్టం అనుకున్నా
నయవంచనతో నాకు వెన్నుపోటు పొడిచినా - తనకి మాత్రమే శత్రువు అనుకున్నా
కానీ ద్రోహిగా మారి అందరికీ నన్ను శత్రువును చేస్తుందని అస్సలు ఊహించానా
కపట స్నేహిని నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పు అని సిగ్గుపడుతున్నా సిగ్గుపడుతున్నా .
నెలవల సహజ,
చిత్తూరు జిల్లా.