మంచి స్నేహితుడు
నాలోని లోపాల్ని ఎత్తి చూపి
తనలోని ధైర్యాన్ని నాలో నింపి,
నాలోని దురలవాట్లను రూపుమాపి
తనలోని సద్గుణాలను నాలో అలవరచి ,
నాలోని బలహీనతను గుర్తించి
తనలోని బలాన్ని నాలో పెంపొందించి,
నా పేదరికాన్ని లెక్క చేయక నాతో చెలిమి చేసి
తన కుటుంబంలో ఒక సభ్యునిగా ఎంచి,
నాలో మంచితనాన్ని అందరికి వెదజల్లి
తన లోకంలో నన్ను హీరోగా చేసుకున్న ఓ మిత్రమా ,
నిన్ను మరిచిపోవడం నా తరమా.
నెలవల సహజ,
చిత్తూరు జిల్లా.