**4600..గజల్.
నిన్ను పొగడలేక చూడు..వానమబ్బు వాగైనది..!
నీ పదములు పూజించగ..అవనితల్లి పువ్వైనది..!
మంచుపూల దారి ఒకటి..ప్రియురాలై పిలిచె చూడ..
అక్షరాల మౌనానికి..అందమైన యేఱైనది..!
వెన్నెలయే వర్షించుట..నేర్చుకునే నవ్వు తనది..
మదిలోయల నిండుతున్న..చైతన్యపు వెలుగైనది..!
పదపదమున నర్తించే..ప్రణయభావ గగనరాశి..
పలుకుతేనె రాగాలకు..స్వరాతీత మధువైనది..!
పరిమళించు చెలిమిపూల..వనమంటే చెలితలపే..
వాసంతపు గమకసిరులు..కోకిలమకు విందైనది..!
పోటీపడు ఊహలతో..పోరాటము మాన్పించెను..
వెన్నుతట్టు తనచూపే..నిజబంగరు కరమైనది..!
మరిమాధవ గజలింటిని..వీడలేని కోమలియే..
ప్రాణాలకు ప్రాణమూదు..పవనవేణు రవమైనది..!