4572..గజల్.
జ్ఞాపకాల పొదరింటికి..పిలిచేవా రాలేను..!
ఒంటరితనమే నిధిగా..అందినట్లు తోచేను..!
కలలనగరి విహరించే..కోరికయే కరిగెలే..
విరహమేమొ మదికి తగిన..వేడుకలో ఉంచేను..!
అమావాస్య నడినిశిలో..సినీవాలి ఎగతాళి..
ఆలోచన చెండాడగ..మెఱుపు కత్తి దూసేను..!
వినిపిస్తూ కనిపించని..నవ్వుకర్థ మేమందు..
చూపలేని గాయానికి..లేపనముగ దక్కేను..!
కలహించే వింతగాలి..పరిమళమే భావమో..
అక్షరాల ప్రేమాగ్నిగ..ఎదలోయల పొంగేను..!
వ్రాయరాని కావ్యంలా..నీ చూపే నాతోడు..
నులివెచ్చని నిజవెన్నెల..వాహినిగా మార్చేను..!
మబ్బులేని గగనంలో..చకోరమై తిరగడమా..
మాధవుడా పేరాశల..మూలమేల రాలేను..!