209..
నిన్నటి తనువిది..నీవే సాక్ష్యము..!!
మొన్నటి మనసిది..నీవే సాక్ష్యము..!!
తలవని తలపుగ రాలేదిచటికి..!!
రేపటి గొడవిది..నీవే సాక్ష్యము..!!
తెలియనిదొకటే..'ప్రేమగ' ఉండుట..!!
కోర్కేల వనమిది.. నీవే సాక్ష్యము..!!
అద్దము భువియని..తెలిసిన చాలును..!!
శ్వాసల తరువిది..నీవే సాక్ష్యము..!!
కాంతికి ద్వారము భా'వన'మేను'..!!
చీకటి సరసిది..నీవే సాక్ష్యము..!!
కోటకు చుట్టూ..తోటయె చూడగా..!!
మౌనపు మధువిది..నీవే సాక్ష్యము..!!
రెపరెపలాడే..తపనల పడవన..!!
జరిగే కొలువిది..నీవే సాక్ష్యము..!!
లక్షల జన్మలు..గడచినవౌరా..!!
జ్ఞానపు ఫలమిది..నీవే సాక్ష్యము..!!
'మాధవ' మాటను..'గీత'గ తలచగ..!!
వెలుగుల నిధి ఇది.. నీవే సాక్ష్యము..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు