మార్గం కృష్ణ మూర్తి
అంతర్జాల వ్యాపారం (ఆన్లైన్ బిజినెస్)

శీర్షిక: అంతర్జాల వ్యాపారం
         (ఆన్లైన్ బిజినెస్)

కరోనా తాకిడికి చెదిరే ప్రపంచం,అల్లాడే జనం
బ్యాంకుల్లో డబ్బున్నా,లేకుండే ప్రయోజనం
అంతర్జాల విధానం ఆశాజ్యోతిగా కనబడే
అమేజాన్ ప్లిప్ కార్ట్, బిగ్ మార్ట్ సంస్థలు నాడే!

రక రకాల ఆప్ లతో, రక రకాల ఆఫర్లుపెట్టే
మేయిల్స్ మెస్సేజ్ లతో వరుసకట్టే
ఇక చరవాణులు, 'వైఫై' లు సులువైపోయే
వస్తువుల ఎంచుకునే, సబ్మిట్  నొక్కే!

గంటల్లోవేడి వేడి భోజనాలు ఇంటికి వచ్చే
వస్తువులైతే వారం రోజుల్లో వచ్చే
అన్ లైన్లో డబ్బులు చెల్లించే, హాయిగా జీవించే
అంతర్జాల విధానం జనులకు అలవాటై పోయే!

సంస్థల వద్ద పూర్తి అడ్రసులు రిజిష్టరాయే
ప్రజల అభిరుచులు మార్టులకు తెలిసి పోయే
పేదలెవరో ధనికులెవరో పూర్తిగా యెరుకాయే
ఆర్ధిక స్థోమతలన్నియు అవగత మాయే!

నిల్వ ఉండలేని ,గుర్తు పట్టలేని పదార్ధాలకు
ఆధరణ తక్కువ , ఆఫర్లు ఎక్కువ
ఆర్డర్ ఒకటిచేస్తే మరొకటివచ్చే, గుర్తుపట్టరాకుండే
ఆన్లైన్లో డబ్బు చెల్లించే, తింటూ పోతుండే!

సైబర్ నేర గాళ్ళకు నేడు అంతా సులువాయే
ఎవరి యిష్టాలు,బలహీనతలేమిటో విశదమాయే
యేమరపాటుతో ఉంటే,ఎక్స్ రే కన్నులాయే
ఫిషింగ్ మేయిల్స్ పంపి,బ్యాంకునిల్వల నూడ్చివేసే!

అంతర్జాల విధానం , రెండంచుల ఖడ్గం "2"
ఆడమర్చామా , జీవితాలు ఆగమాగం "2"

హామీ పత్రం: ఇది నా స్వీయ రచన ,దేనికి అనుకరణ కాదు

రచనకు మీ మార్కులు ఇవ్వండి. పోటీ లో ఉన్న రచనలకు ఈ మార్కులు ప్రభావితం చేస్తాయి. బాగా అలోచించి మార్కులు ఇవ్వండి.
0
0
0
0
0
0
0
0
0
0
0
No votes have been submitted yet.
సంగారెడ్డి

PLOT NO.68 , KSR COLONY , ROAD NO.5 , AMEENPUR (MANDAL& POST) , HYDERABAD - 502032