శీర్షిక: నీ హక్కే నీ ఆయుధం
అవినీతిపై ఉక్కుపాదం మోపే అవకాశం
అన్యాయాలను ఎండగట్టే శంఖారావం
ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం అని మురిసి
మేధావుల కృషితో ముస్తాబైన ముసాయిదా!
పాలనలో పారదర్శకత అంటూ
భావప్రకటన హక్కు కావాలంటూ
బలవంతుల వాదనలతో
సామాన్యునికి ఒసిగిన వరం!
అయినా ఏమి లాభం?
ఎన్నో సడలింపులు నడుమ
లోసుగుల గతుకులకి అతుకులు వేసినట్టు
తుమ్మితే ఊడిపోయే ముక్కులా వెలసిన చట్టం!
ప్రశ్నించే ప్రాణాలను బలిగొన్న శాస్త్రం
కనిపించని అన్యాయాలకు దొరికిన అస్త్రం