గజిబిజి లోకంలో బిజీబిజీ లైఫ్లు
పక్కపక్కనే ఉన్నా పట్టించుకోలేని
బిజీ షెడ్యూలు!
ఆకాశంలో తారలా
అందనంత దూరాన
అందంగా కనిపించే జీవితాలు!
అంతరాలతో అలమటించే లైఫ్ స్టైలు!
కనుచూపు మేరలో కవ్వించే పర్వతాలైనా
కనపడని లావాణి మోస్తున్న హృదయాలు!
ఎవరి కష్టం వారికే ఎవరెస్టు
మోసేవాడికే తెలుస్తుంది దాని ఎఫెక్ట్ !
తెలుసుకోలేని మూర్కిస్టులకు
నిలబడిన రెండు అడుగుల నేల ఎప్పుడూ చీపెస్ట్
పోయాక చేరే ఆరడుగుల నేల తెలిపే రియలిస్టిక్ !
ఉన్నది పొందలేని బ్లైండ్నెస్
పోయేవరకు వదలలేని ఎన్వియస్