320..
పూవులసలు తెంపనేల.. పూజ సేయ రాధమ్మా..!
మనసు పూవు కదా మిన్న..పూజ సేయ రాధమ్మా..!
నీవు నేను వేరు కాదు..గుర్తించుము ఈ సత్యము..!
నన్ను వినుము గుండె లయల..పూజ సేయ రాధమ్మా..!
ముగ్ధత్వము కన్న గొప్ప వెన్న ఏమున్నది ఓ చెలియా..!
బేల తనము చూపనేల..పూజ సేయ రాధమ్మా..!
పూర్ణచంద్ర బింబము వలె ఉన్న మోము వంచనేల..!?
దృష్టి నిలుపు నా పదముల.. పూజ సేయ రాధమ్మా..!
ఆ తారలు ఈ వేణువు సాక్షులు మరి మన ప్రేమకు..!
బెంగ వలదు శ్వాస ధార..పూజ సేయ రాధమ్మా..!
నీవు లేక లేదు సఖీ..ఈ 'మాధవ' ఉనికి చూడ..!
చాలు కదా నిజ వలపుల..పూజ సేయ రాధమ్మా..!