323..
ఆశల వెన్నెల చెట్టువు నీవే..!
తీరని కోర్కెల గట్టువు నీవే..!
ఏదీ తప్పుగ లేదీ జగాన..!
రేపటి విలువల మెట్టువు నీవే..!
పట్టీ పట్టని తనమది ఏలా..?!
విజయపు ఆయువు పట్టువు నీవే..!
కత్తులు దూయకు కోపం పైనే..!
మైత్రికి సరియగు జట్టువు నీవే..!
శ్వాసకు సాక్షిగ ఉంటే చాలోయ్..!
ప్రేమకు నిత్య విరాట్టువు నీవే..!
మోహాతీతం 'మాధవ'తత్త్వం..!
తలపుల నిజ సమ్రాట్టువు..నీవే..!