Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

365
వెన్ను తట్టే మాట కన్నా..వెన్నపూసది ఏమిటోయి..!?
సాయమయ్యే చేయి కన్నా..దైవ రూపది ఏమిటోయి..?!
రాళ్ళపై పడి మ్రొక్కుతూనే..జన్మలేలా ముగిసెనో..?!
అడుగు అడుగున ప్రశ్న కన్నా..గొప్ప గొడుగది ఏమిటోయి..?!
మరపు తోటన పరిమళాలకు..లొంగిపోవుట సహజమే..!
గురుతు చేసే మనసు కన్నా..మిన్న గురువది ఏమిటోయి..!?
అనుభవాలను నెమరువేస్తూ..మురిసిపోతే..మంచిదే..!
వ్యథను రేపే కథల కన్నా..తలచ గోడది ఏమిటోయి..!?
నివురు గప్పిన నిప్పు మాదిరి.. ఉండిపోతే ఎలానోయ్..?!
కలలు కాల్చే జ్వాల కన్నా..వలచ ధనమది ఏమిటోయి..?!
'మాధవు'నకు..ఏ మిఠాయీ ..పనియె లేదని తెలియలేవా..!
మానవత్వపు బాట కన్నా..రాచ తెరువది ఏమిటోయి..!?

గురువది ఏమిటోయి
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.