367
ఎడబాయని నీ రూపము నా కన్నుల శుభ దీపము..!
మధురమైన నీ భావన నా తలపుల శుభ దీపము..!
అణువణువున కదలాడే ప్రశాంతతకు మేర లేదు..!
నా బ్రతుకును పండించే.. నిజ వలపుల శుభ దీపము..!
ఎద లోతుల పొంగుతున్న ఆ హాయిని పలుక జాల..!
నా భ్రాంతులు తొలగించే..అమృత మరుల శుభ దీపము..!
ప్రేయసిగా ఎలా నన్ను ఎంచు కొంటి వోయి ప్రియా..!
నా సిగ్గుల కెంపులకే..నిత్య సిరుల శుభ దీపము..!
నా కలతలు తీర్చినావు..ముదమెంతో కూర్చినావు..!
నా మమతల కోవెలకే..శ్వాస ఝరుల శుభ దీపము..!
'మాధవు'డా..! తెరువలేను..ఈ రెప్పలు ఎన్నటికీ..!
నా'నేను'ల గుండె లయల..మౌన గిరుల శుభ దీపము..!