గజల్ 3642.
మనుషులకూ పురుగుమందు..కొట్టవలసి రావటమే..!
విశ్వప్రగతి 'కరోనా'కు..చేతులెత్తి మొక్కటమే..!
చేతులార చేసుకున్న..పాపాలకు శిక్ష కదా..
విర్రవీగు విజ్ఞానం..మట్టికరచి పోవటమే..!
ఎవరి లెక్క లెంతవరకు..వచ్చినవో ఏమోలే..
దోచుకున్న కోట్లు బుగ్గిపాలు చేయటమే..!
ఏది ఎవరి సొంతమంటె..వేదాంతం అంటారే..
జరిగే మారణహోమం..నిలువరించ చూడటమే..!
సకలజీవ కారుణ్యం..తక్షణ తరుణోపాయం..
ఇకనైనా సమభావం..నింపుకు ధ్యానించటమే..!
ప్రాణులన్ని మరి మాధవ..ప్రతినిధులే గమనిస్తే..
చెలిమిమీర నిత్యప్రేమ..పూజలోన ఉండటమే..!