గజల్ 3703.
అడవిలోన జీవించుట..భద్రముకద నేస్తం..!
మరణభయం లేదిక్కడ..నిక్కముకద నేస్తం..!
చంపుకుతిను మోజువలన..చావువచ్చె కాదా..
చెబితే విని మార్చుకొనుట..అందముకద నేస్తం..!
కందమూల ఫలములెంత..అమోఘమో చూడూ..
శాంతినిచ్చు గాలినంద..సౌఖ్యముకద నేస్తం..!
లోకమెన్ని రుచులలోన..మునిగిపోయె అయ్యో..
చెట్లన్నీ నరుకుటెంత..పాపముకద నేస్తం..!
ఎన్ని వనరులిచ్చినదీ..పుడమితల్లి ఆహా..
కాలుష్యపు నివారణం..ధర్మముకద నేస్తం..!
మాధవుడే వస్తాడా..వేరేగా దిగిదిగి..
వెలుగుతేనె సేవించుట..జ్ఞానముకద నేస్తం..!