384..
కోటి మనసుల పుట్ట ఉన్నది.. ఒక్క బీజము.. తరచి చూస్తే..!
అమృత రాశుల కొశమున్నది..ఒక్క హృదయము..తరచి చూస్తే..!
కర్మ మూలము పట్టుకుంటే..గొడవలన్నీ తొలగిపోవును..!
సత్య కాంతుల ద్వారమున్నది..ఒక్క శ్వాసను..తరచి చూస్తే..!
పరుగు తీసే పసిడి మబ్బుల..అడుగు జాడలు..అందుకొనగా..
ప్రేమ తత్వపు నీడలున్నవి..ఒక్క మాటను..తరచి చూస్తే..!
అలల మువ్వల సవ్వడులలో..ఉన్న సంగతు లెంత మధురం..!
కొండ గాలుల..తీవలున్నవి..ఒక్క బుడగను..తరచి చూస్తే..!
పలకరించే మట్టి కణమున..మారుమ్రోగే వీణ లెన్నో..!
రాగ రవళుల..రథములున్నవి..ఒక్క సంజ్ఞను..తరచి చూస్తే..!
అక్షరాలకు ప్రాణ మూదే..మౌన సాక్షికి..సాక్షి యగుటకు..
'మాధవా'ద్భుత..నగవులున్నవి..ఒక్క 'గీత'ను..తరచి చూస్తే..!