402..
కాంతి పూల తోటలోన కలసినాము..మనస్సాక్షి..!
శాంతి మాధవు పంచేందుకు పుట్టినాము..మనస్సాక్షి..!
చినుకు చినుకు ఎద తరగల మెరుపులమే..మనము కదా..!
ప్రేమ వాన కురిసేందుకు..నిలచినాము..మనస్సాక్షి..!
ప్రతి రేణువు మదిని మీటు సుస్వరాల ధనువులమై..!
పరిమళించు..శ్వాస సుధల వెలసినాము..మనస్సాక్షి..!
ఒంటరింటి విరహాలను..మాన్పివేయు ఏకాంతము..
ప్రసాదించు గూటిలోన..చేరినాము..మనస్సాక్షి..!
నా బింబము నీవు గాక..నీ ప్రతి 'నిధి' నేను గాక..
సత్యమింక లేదన్నది..తెలిసినాము..మనస్సాక్షి..!
ఆ'మాధవ' తత్వానికి అద్దంలా అయ్యేందుకు..
మన'నేను'ల చిత్రాలను..నిలిపినాము..మనస్సాక్షి..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు