406..
హృదయ హాస మందారం..నీ సొగసై..పూసింది..!
స్నేహ సుధల మందారం..నీ నవ్వై..పూసింది..!
నీవు లేక ఉండలేదు ఏ క్షణమూ అద్భుతమై..!
మధుర భావ మందారం..చందనమై..పూసింది..!
నడువకనే నడిపింతువు..గతులన్నిటి గమకమువై..!
సుస్వరాల మందారం..సుమధనువై..పూసింది..!
పలుకకనే పలికించే పద లహరుల సునాదమా..!
వినోదాల మందారం..నవ వధువై..పూసింది..!
స్వర్ణ కమల పరిమళమది విందు చేయు మనోహరీ..!
స్వప్న గగన మందారం..శుభ తరువై..పూసింది..!
'మాధవు'నే..అర్చించే విధమేదో ఓ సఖియా..!
మౌన రాగ మందారం..నా తలపై..పూసింది..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు