417..
వాడక ఉండే..బంధం.. స్నేహం..!
తరగక నిలచే..గంధం.. స్నేహం..!
'నీవూ నేను'ల ఆటను కంటే..
చెదరక మిగిలే..పుష్పం..స్నేహం..!
హాయిగ నవ్వే మనసే ఉంటే..
ఎప్పుడు వెలిగే..దీపం..స్నేహం..!
తనకై తలచక పంచుతు పొతే..
ప్రేమగ పెరిగే..వృక్షం..స్నేహం..!
మనిషిగ పుట్టిన కారణ మెరిగిన..
తప్పక దక్కే..స్వర్గం..స్నేహం..!
ఆలోచనలో కదిలే..మెరుపై..
తోడై నీడై నడిపే భావం స్నేహం..!
భువినే బడిగ తెలిసిన చాలును..!
'మాధవ' వేణువు కురిసే..రాగం..స్నేహం..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు