436..
ఏ రాగం వినిపింతువొ..ఈ విరహపు వెన్నెలలో..!
నీ స్నేహం చాలు ప్రియా..మధుమాసపు వెన్నెలలో..!
కలువలతో కలహాలకు దిగనేలా.. నడిరేయిని..!?
జాబిలినే కవ్వించే..సుమహాసపు వెన్నెలలో..!
నేర్చిన నా విద్యలన్ని.. వ్యర్థమాయె నీ ముంగిట..!
కలల కడలి కదలాడే.. నవరాగపు వెన్నెలలో..!
చిరుగాలిని కాకపోతి.. నీ కురులను సవరించగ..!
మరు మల్లెల పరిమళాల.. శుభ మాఘపు వెన్నెలలో..!
మది పెదవుల నినదించే.. అమృత ప్రేమరాశి నీవు..!
మనువాడిన తొలిశ్వాసల.. నిజ మౌనపు వెన్నెలలో..!
'మాధవు'డా..! ఏదోయీ.. బృందావని మాధుర్యం..?!
సాక్షియైన యమునాతటి..ప్రియ పరువపు వెన్నెలలో..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు