441..
ఈ చల్లని ఉదయమెంత - హాయినొసగె నీ సన్నిధి..!
ఈ వెచ్చని వేకువెంత - శక్తినొసగె నీ సన్నిధి..!
వేచి వేచి నిదుర - నిదురపోవు టెంతవింత అహో..!
ఈ తీయని సమయమెంత - యుక్తినొసగె నీ సన్నిధి..!
చూసి చూసి అలసటేమొ - అలసి మూగపోయె చూడు..!
ఈ చక్కని విషయమెంత - భక్తినొసగె నీ సన్నిధి..!
చిన్నబోయె శాస్త్రాలే - నీ చూపుల భావాలకు..!
ఈ ఆమని వెన్నెలెంత - రక్తినొసగె నీ సన్నిధి..!
ఆగిపోయె అస్త్రాలే - నీ మౌన హాసాలకు..!
ఈ తరగని భోగమెంత - దీప్తినొసగె నీ సన్నిధి..!
ఓ 'మాధవ' ఎలా నీవు - ఉంటావో మెలకువగా..!?
బృందావని ధ్యానమెంత - ముక్తినొసగె నీ సన్నిధి..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు