460..
గడ్డి పూవు భాష నాది - చెప్పలేను పెదవి విప్పి..!
గుడ్డి గవ్వ ఘోష నాది - తెలుపలేను మదిని నిలిపి..!
గులాబీల ముళ్ళ వాడి - ఎన్ని కథలు పలికేనో..!?
రాతి గుండె ఆశ నాది - మరువలేను అడవి నరికి..!
ఆ తారల తోట దారి - దొరకదాయె ఈ కనులకు..!
మనసు పడ్డ శ్వాస నాది - విడువలేను పుడమి ఒడికి..!
ప్రేమ విలువ చెప్పాలని - చెప్పలేని ఆరాటం..!
తేనెలొలుకు బాట నాది - చూపలేను పట్టి పట్టి..!
సకల చరాచర రాశులు - నా స్నేహితులని తెలిసెను..!
చెలిమి చెలమ ఊట నాది - పంచలేను పొంగి పొర్లి..!
యము'నా'నది..తరగలనిధి - తేలియాడు 'మాధవుడా..!'
చిటియటుకుల మూట నాది - ఇవ్వలేను చేయి చాచి..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు