491..
శాంతి నిచ్చు కాంతులన్ని నేత్రాలకి తెలుసులే..!
వింత హాయి దారులన్నిహృదయాలకి తెలుసులే..!
ముదము గూర్చు పరిమళాల వనములో..
ప్రకృతి కాంత సొగసులన్ని మధుపాలకి తెలుసులే..!
నీవెవరో చెప్పేందుకు నేనెవరో తెలియనే..
నీ నవ్వుల వెలుగులన్ని వేదాలకి తెలుసులే..!
కలవరించు తత్వానికి ప్రతీకగా ఉంటిగా ..
నీ పిలుపుల వలపులన్ని మోహాలకి తెలుసులే..!
కణం కణం వికసించగ ఎంత కృషిని చేస్తోందొ..?!
అనుక్షణం రగులుతున్న తాపాలకి తెలుసులే..!
నా శ్వాసకు ఛత్రమ్ముగ ఓ 'మాధవ'.. భావనా..!
నీకు సాక్షి తలపులన్ని జీవాలకు తెలుసులే..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు