493..
అంతులేని కాంతి పూలు ~ చల్లినావు నా దారిని..!
ఎన్ని కోట్ల శాంతిలతలు ~ నాటినావు నా దారిని..!
నన్నునేను విడచి మరచి ~ ఎలా బ్రతుకుతున్నానో..?!
దారాలుగ మెరుపు కథలు ~ అల్లినావు నా దారిని..!
అత్యుదార ప్రేమధార ~ మధువెలాగ ఉంటుందో..?!
తలపుజిహ్వ నేలు రుచులు ~ కురిసినావు నా దారిని..!
అక్షరాల కొలువు మీటు ~ మౌనమెంత రసభరితం..!
భావజలది గగనాలను ~ పొదిగినావు నా దారిని..!
మనసు మనసు ఆరాటం ~ కరిగింతువు..బహు లీలగ..!
మంచువెన్న విరజాజులు ~ పరచినావు నా దారిని..!
చిలిపితనపు చిరునామా ~ వరమొసగిన 'మాధవుడా'..!
ప్రణయ వేణు మృదు రవాలు ~ నింపినావు నా దారిని..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు