510..
చినుకు చినుకు గుండెకెరుక మట్టిప్రేమ ముద్రలన్ని..!
చెలియ మనసు గూటికెరుక గాలిప్రేమ ముద్రలన్ని..!
తపియించే ముచ్చటలో మైమరపే వరమేమో..!?
పరిమళించు దారికెరుక చిలిపిప్రేమ ముద్రలన్ని..!
తాళలేని వానవిల్లు మౌనమయే వేళలలో..
నీలిమబ్బు గుంపుకెరుక నీటిప్రేమ ముద్రలన్ని..!
అంతులేని ఆశ తీర్చు ఆ వెన్నెల కొలువులోన..
నిదురించే శిల్పికెరుక అగ్నిప్రేమ ముద్రలన్ని..!
కలలరాగ వీచికలకు తలలూపే నవ్వులలో..
మునిగితేలు హంసకెరుక సాక్షిప్రేమ ముద్రలన్ని..!
ఆ'రాధకు కావాలట తన 'మాధవ' చిరునామా..!
పలుకరాని మధువుకెరుక తేటిప్రేమ ముద్రలన్ని..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు