529..
ఓ ప్రేమ పూవునై ~ చూడంగ రాలేన..?!
జన్మ చెరలను వీడి ~ ఎదగంగ రాలేన..?!
కళ్యాణ ఘడియలే ~ ఎదురైన కాలాన..
ఈ కలల శ్వాసలిక ~ ఇష్టంగ రాలేన..?!
విరహాల ఈ జలధి ~ నాకెందుకో ప్రియా..!
నీ పాటలీపూల ~ గంధంగ రాలేన..?!
మురిపాల తీర్థమౌ ~ నీ పసిడి వానలో..
స'రసాల ముత్యాలు ~ చిందంగ రాలేన..!?
ఏ తేనెమబ్బులో ~ కదిలించు నీ చూపు..
కురిసేటి కాంతులే ~ అందంగ రాలేన..?!
ఆ'మాధవ' వేణువై ~ నీవున్న సమయాన..
మెరిసేటి రాగాలు ~ పొందంగ రాలేన..?!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు