535 ..
జన్మలుగా చదువంతా ..తెలివిగానె మారుతోంది..!
సృష్టి లోని ప్రతి కణమూ..గురువుగానె మారుతోంది..!
రాళ్ళలోన ఉన్ననీరు..హృదయాలకు అందునులే..
మాయమైన మబ్బు జాడ..కరువుగానె మారుతోంది..!
కంటితడిని ఆపలేని విరహమేల నా మనసుకు..?!
చెలియప్రేమ చూడ కల్ప తరువుగానె మారుతోంది..!
ఏ కోకిల గానానికి పులకించునొ వనమంతా..
ప్రతిపూవు రాగమదే..మధువుగానె మారుతోంది..!
కనిపించని మబ్బుకన్నె..ఘోష ఎవరికందేనూ..!?
కురవకుండ అగ్నిపూల..చెరువుగానె మారుతోంది..!
'మాధవు'డే చెబుతున్నా..ఎందుకంత నిర్లక్ష్యం..?!
కాలుష్యపు వింతనవ్వు..బరువుగానె మారుతోంది..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు