543..
గిరగిర తిరిగే బొంగరమేనా.. జీవితమంతా..!?
ఎంతకు తరగని సంగరమేనా.. జీవితమంతా..!?
తియ్యని స్నేహం కోసం.. కలవరమేదీ..!?
దిక్కే తోచని సాగరమేనా.. జీవితమంతా..!
ఎవరికి వారే యమునాతీరుగ.. మసలగనేలా..!?
మనసే పెట్టని ఆదరమేనా..జీవితమంతా..!?
ఆశను వీడక..గొడవలు పడుతూ అలసటలేలా..?!
కర్మలు తొలగని ఉంగరమేనా..జీవితమంతా..!?
వెన్నెలచెట్టును వేదనజలధిని ముంచకు నేస్తం..!
మౌనం తెలియని మంతరమేనా..జీవితమంతా..!?
సాక్షీ తత్వపు కోవెల చేర్చే 'మాధవు'డేమను..!?
మోహం వీడని పంజరమేనా..జీవితమంతా..!?
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు