Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

577 //
పైరుపచ్చ పరికిణితో ముద్దొచ్చే బంగారూ..! 
పొలం పనికి అంకితమై చెమటోడ్చే బంగారూ..!
పదోక్లాసు వరకు చదివి వ్యవసాయం చేసేవా..!
వారేవా తండ్రినెరిగి సాయమయే బంగారూ..!
ఈల వేస్తు బండితోలు నీకెందుకు చర్నకోల..!?
అసలు సిసలు అమ్మ మనసు నీదేలే బంగారూ..!
ప్రకృతి తోటి సహచర్యం ఇష్టపడే నా మరదల..! 
ఆకుపచ్చ ఓణీలో అలరించే బంగారూ..!
కన్నతల్లి కష్టంలో పాలుపంచుకుంటావే..!
సంకురాత్రి లక్ష్మిమల్లె ఎదురొచ్చే బంగారూ..!
ఆ'మాధవ' పూజసేయు సుమకోమలి నీవేగా..!
నా ఆశలు సర్వస్వం పండించే బంగారూ..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

బంగారూ
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.