582..
చిరునవ్వుల జాబిలిగా ..నీ మోమును చూస్తున్నా..!
పరిమళించు సంక్రాంతిగ..నీ సొగసును చూస్తున్నా..!
మధువులెన్ని వర్షింతువొ..ప్రతిక్షణం ఓ సఖియా..!
నవవసంత కోవెలగా..నీ మనసును చూస్తున్నా..!
కోటికోట్ల గగనాలకు..అధిదేవత నీవేగా..!
విశ్వప్రేమ భాండముగా..నీ రూపును చూస్తున్నా..!
చూపులకే అతీతమౌ..నిత్యసత్య కోమలివే..!
మౌననిధికి మూలముగా..నీ చూపును చూస్తున్నా..!
చూసేందుకు ఉన్న సాక్షి..వేరేగా లేదు కదా..!
ఉండి లేని వేడుకగా..తను తరువును చూస్తున్నా..!
ఆ'రాధా'మాధవులే..ఏకమైన చోటేదో..?!
బృందావని చందముగా..కణకణమును చూస్తున్నా..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు