// 583 //
అందమైన అనుభవాల కథలనెపుడు..మరువలేను..!
అలరించే శ్వాససాక్షి వీణనెపుడు..మరువలేను..!
మనసు లోని ఆశలన్నీ నెరవేర్చే ప్రియ సఖియా..
నీ నవ్వుల అందమైన తోటనెపుడు మరువలేను..!
చిగురాకుల కోవెలలో అనురాగపు రాశి నీవు..
నీ చక్కని నవవసంత సుధలనెపుడు మరువలేను..!
నా కవితకు శ్వాస మల్లె..నిండుతున్నస'రసాంగివి..
ప్రియమారగ తోడయ్యే ఊట నెపుడు మరువలేను..!
జన్మలుగా ఆడుకున్న సంగతులే ఎంత వింత..
నిన్నమొన్న లాగె తోచు ఆటనెపుడు మరువలేను..!
నా దారుల ముళ్లన్నీ పూల లాగ మార్చినావు..
నీ చక్కని ఆ కాంతుల పొదలనెపుడు మరువలేను..!
ఓ 'మాధవ' నీవెవరో..తెలియలేను.. చూచుటెపుడు..!?
అనుబంధపు గంధమైన రాధనెపుడు మరువలేను..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు