621..
ప్రతి నిత్యం క్రొంగొత్తగ..శక్తినిడే ప్రచోదితా..!
వింతవింత దొంగాటల..యుక్తినిడే ప్రచోదితా..!
లేము కదా నీవు నేను..విడివిడిగా ఒక్క క్షణం..!
నామరూప అతీత అనురక్తినిడే ప్రచోదితా..!
ప్రియాప్రియ భావననే..రద్దు చేయు స్వభావమా..!
అక్షరాల అమృతమధుర..భక్తినిడే ప్రచోదితా..!
మౌనకాంతి దివ్వెలెన్నొ..దాగున్నవి ప్రతి కణమున..
చూడగల్గు శుభకర ఆసక్తినిడే ప్రచోదితా..!
విశ్వాలకు అత్యద్భుత..వినోదాలు చేతువేల..!?
ముచ్చటగా మదినిదోచి..ముక్తినిడే ప్రచోదితా..!
మాతృత్వపు కోవెలగా..ప్రతి తలపును చూపేవు..!
ఆ 'మాధవ' సాక్షియైన..ఉక్తినిడే ప్రచోదితా..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు