ముదిమి ఈడు
కూటికి కరువైన - నీ కడుపును కాల్చానా
నేడు కలిమికి కర్తవైన - నేను కానరాక కష్టమయ్యానా,
సర్వ సంపదలు అంతరించిన- నీ సమృద్ధికి స్వస్తి పలకాన
నేడు సంపదతో తులతూగుతున్న - నేను సమస్యగా మరానా,
భారమైన బతుకు లాగలేకున్నా - నీ భవితను బీడు చేశానా
నేడు భాగ్యవంతుడవైనా - నేను భరించలేని భారమయ్యానా,
చెమటధారలు కారుతున్న - చిన్నలోటు నీకు చేశానా
నేడు చక్రవర్తిలా చలామణిఅయిన - నేను చిమ్మటగా మారానా,
జాగులేకుండ జాగాన్ని వదిలి జడివేగంతో జారుకోవాలనుకున్న జరిగేది అనుభవించడం తప్ప జరగబోయేది మార్చగలనా .
నెలవల సహజ,
చిత్తూరు జిల్లా.