శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో రచించిన భక్తి శతకము. ఈ శతకానికి దాశరథీ కరుణాపయోనిధీ అనే మకుటం అన్ని పద్యాలలో చివరగా వస్తుంది. దాశరథీ అనగా దశరథుని పుత్రుడైన శ్రీరాముడు. గోపన్న ఆత్రేయస గోత్రుడు . కాంమాంబ యాతని తల్లి, తండి... లింగన మంత్రి. ఈ విషయమును ఇతడు ఈ పద్యమున తెలెపెను.
అల్లన లింగ మంత్రి సుతుడత్రిజగోత్రజడాదిశాఖ కం
చెర్లకులోద్భవుండన బ్రసిద్దుడనై భవ దంకితంబుగా
నెల్ల కవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
ద్వల్లభ: నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ.
ఈ కవి ఈ శతకమే గాక మరికొన్ని గ్రంథములను కూడా వ్రాసినట్లు కానీ వాటిని ఇతరులు మోసముతో తస్కరించినట్లూ ఈ క్రింది పద్యము వలన తెలియుచున్నది.
మసగొని రేగు బండ్లకును మౌక్తికముల్ వెలపోసినట్లు దు
ర్వ్యసనము జెంది కావ్వము దురాత్ములకిచ్చితి మోసమయ్యెనా
రసనకు బూతవృత్తి సుకరంబుగ జేకురునట్లు వాక్పుధా
రసములు చిల్క పద్యముఖరంగము నందు నటింపవయ్య సం
తపసమును జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.a