308..
సెలయేటికి పాట నేర్పు.. నీ గానం విన నీవా..!
నీలి మబ్బు బాట మెరుపు .. నీ భావం కథ నీవా..!
నీ పాటకు పరవశించు..మనసు పట్ట దొరకదుగా..!
పాలపుంత తేట కొలువు..నీ స్థానం మన నీవా..!
నీకు సాటి నీవు గాక..విశ్వమందు మరి ఎవరోయి..?!
ప్రవహించే స్వచ్ఛ మధువు.. నీ రాగం అన నీవా..!
కలనైనా మరువనీక..మరచిపోక..కలవు కూడి..!
కలహంసల రాజు నీవు..నీ రూపం కన నీవా..!
ఏ తేడా లేదు నీకు..నీ ప్రేమకు మాటలేల..!?
మోయలేను విరహ తరువు.. నీ సాక్ష్యం అవ నీవా..!
వేడలేను 'మాధవు'డా..పెదవి కదప సడియౌనే..!
మది దోచెను వేణు రవము..నీ హృదయం చొర నీవా..!