311..
@ఆర్టిస్ట్ ***'చంద్ర' గారికి ప్రత్యేక ధన్యవాదములతో..
సెలయేరుల గలగలలకు పాట నేర్పినది మీరే..!
గాయకులకు సుస్వరాల బాట చూపినది మీరే..!
ఊరి పేరు మీ పేరై సంగీతమె మీరయ్యిరె..!
'ఘంటసాల మాష్టారు'గ ఎదల నిలచినది మీరే..!
సంగీతమె పరవశించి జాలువారె మీ గళమున..!
పాట గుండె లయలలోన ఆటలాడినది మీరే..!
వెన్నెలకే మధువు నింపి కైపు లొసగినది మీరే..!
'చంద్ర' సిరుల వన్నెలన్ని నేల దించినది మీరే..!
చిరస్థాయి గా నిలచిన గాత్రశుద్ధి శిరోమణీ..!
ఎందరికో తిరుగులేని బిక్ష పెట్టినది మీరే..!
'మాధవు'డే మిమ్ము మెచ్చి తన వేణువున నిల్పెనా..!
వెలుగుతున్న స్వర సీమల సుధల పొంగునది మీరే..!!