Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

538..
వేటాడు కాలాలు ~ లేవసలు చూడంగ..!
వెంటాడు కస్టాలు ~ లేవసలు చూడంగ..!
సౌఖ్యాలకై పోరు ~ సలిపేది మనసేను..!
పీడించు రోగాలు ~ లేవసలు చూడంగ..!
యేరులా ప్రవహించు ~ తీరేదొ తెలియాలి..!
బాధించు మోహాలు ~ లేవసలు చూడంగ..!
దూకేటి సరిగంగ ~ ఉంది'లే..లోలోన..!
కలహించు రాగాలు ~ లేవసలు చూడంగ..!
నీ శ్వాస దారిలో ~ సంపదల కొలువుంది..!
ఎదురోచ్చు మరణాలు ~ లేవసలు చూడంగ..!
సత్యమే వివరింప ~ జాగేల 'మాధవా'..!
ఎచటనో తీర్థాలు ~ లేవసలు చూడంగ..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

లేవసలు చూడంగ
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.