211..
సాగే నదిలా బ్రతికేటందుకు..లక్ష్యాలెందుకు..!?
నిశ్చల జలధిగ నిలిచేటందుకు..గమ్యాలెందుకు ..!?
తెలిసేకొలదీ తెలియగ ఏమీ క్రొత్తగ లేదోయ్..!!
లోకాలన్నీ తిరిగేటందుకు..పాదాలెందుకు..?!
ఆలోచనలో ఉన్నది అంతా..చూస్తే చాలోయ్..!!
శ్వాసకు సాక్షిగ ఉండేటందుకు..వాదాలెందుకు..?!
ఎద లోతులలో మౌనపు కోవెల..మునుగుట ధర్మం..!!
రక్షణ కవచం పట్టేటందుకు..రాగాలెందుకు..!?
జ్ఞానం సర్వం నీ కణ కణమున..కొలువై ఉందోయ్..!!
కాస్త ఆగి కాంచేటందుకు..ఖేదాలెందుకు..?!
కష్టాలన్నీ తొలగించటమేం కష్టం కాదోయ్..!!
'మాధవ' సుధనే..గ్రోలేటందుకు..తేడాలెందుకు..?!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు