శీర్షిక: ప్రారబ్దం
వస్తున్నా వస్తున్నా
కలి కాలపు కర్మలకు
ఫలితాన్నే వస్తున్నా
మృత్యువునై వస్తున్నా...!
పంచభూతాల సాక్షిని
పంచనామా చేస్తున్న
దిగజారుడు చేష్టలకు
సమాధానమే వస్తున్నా!
చరిత్రను చెదలు పెట్టించి
చంద్రమండలంలో చేరాలన్న
స్వార్ధపు ఆటకి చెక్ పెడుతున్న
నీచమైన రాజతంత్రలా నడుమ నలుగుతున్న
ధరణి రక్షణకై కదం తొక్కుతున్న!
నరజాతి నాస్తికత్వానికి విసిగి
ధర్మ స్థాపనకై ఎదురుచూస్తున్నా!
మానవత్వపు రుచిని
గుర్తు చేయటానికి చూస్తున్నా!
నీతి నియమాలను ఆహుతి చేసి
అజ్ఞానపు రంగు పులుముకున్న
అబద్ధపు ముసుగు తీయడానికి
భూభార ఉపశ్రమనకై వస్తున్నా!
వరదనై, వాననై, వాయుగుండమై
మరణం లేని క్రిమినై...పగ తీర్చుకోవటానికి
ప్రపంచాన్ని చుట్టేస్తూ తిరిగి వస్తున్నా
ప్రారబ్ద ఫలితాన్ని తెస్తున్నా...!!
-జ్యోతి మువ్వల
6/12/21