326..
శ్రావణ మేఘం పలికెను నేడే..!
నా చెలి హృదయం మురిసెను నేడే..!
తియ్యని గజలై సాగే వేళై..
వేకువ గానం కురిసెను నేడే..!
సోదరి సోదర బంధం ఫలమై..
పౌర్ణమి రాగం విరిసెను నేడే..!
చెలి మది వెన్నెల దారిగ మారగ..
సొగసరి ప్రణయం తడిసెను నేడే..!
వర్షపు ఛాయలు తడబడు చుండగ..
స్వాగత గీతం మెరిసెను నేడే..!
'మాధవ' రాధకు కోరిక ఏమో..?!
జీవన వేదం వెలిగెను నేడే..!