327..
మావిని వేపను సమముగ తలచే.. కోకిల నా సఖి..!
అనుబంధాలకు సాక్షిగ నిలచే.. కోకిల నా సఖి..!
తీరని విరహం గళమున పొంగగ పాటల కొమ్మల..
అనురాగాలను..స్వరమున కురిసే..కోకిల నా సఖి..!
కలలకు అద్దం పట్టే తలపుల వారధి తానే..!
ఆత్మీయతనే..అనయము పంచే.. కోకిల నా సఖి..!
మాయా.. మోహం..కలబడు తగవుల తీర్చే పనిలో..
వసంత సంతస మాధురు లొలికే.. కోకిల నా సఖి..!
కలతల కనలే..మనసుల మంటలు చల్లార్చేనే..!
చివురుల కెంపుల శ్వాసలు మీటే.. కోకిల నా సఖి..!
రాధా..'మాధవ' బృందావనిలో ఒంటరి తానై..!
ఏకాంతమునే ఏలగ సాగే..కోకిల నా సఖి..!