328..
నా పాటల తోటలోని.. తియతియ్యని.. కోకిలమా..!
నా ఊపిరి కోటలోని.. వెచవెచ్చని.. కోకిలమా..!
నా మదినే గెలుచుకున్న మహరాణీ..మనోహరీ..!
గుండె లయల గూటిలోని.. తెలతెల్లని.. కోకిలమా..!
మంచు పూల ఎదలోయల పలకరించు కోమలివే..!
విరహాలను మాయచేయు.. చలచల్లని.. కోకిలమా..!
మధురాపురి దారి చూప..పరిమళించు ప్రియ సఖియా..!
దిగంతాలు కలుపుతున్న..పచపచ్చని.. కోకిలమా..!
ఎవరికెవరు సాక్షి ఇచట..శ్వాస మాటు ప్రాణ ప్రదా..!?
నవరసాల నొలుకుతున్న..నలనల్లని..కోకిలమా..!
'మాధవు'నకు..వేణువులో..సుస్వరాల ధారవహో..!
రాధా మది నేలుతున్న..చకచక్కని..కోకిలమా..!