339..
నీ తలపుల మేడ కదా..నా మనసే..బంగారూ..!
నీ వలపుల తోట కదా..నా ఆశే..బంగారూ..!
హంస ధ్వని రాగాలను..ఆలపించు వేడుకలో..
నీ ఊసుల మూట కదా..నా పలుకే..బంగారూ..!
నను వీడని వెన్నెలయై..ప్రవహించే కోమలివే..!
నీ నవ్వుల వాన కదా..నా పాటే..బంగారూ..!
నా నీడగ నీవున్నా..గమనించగ చేతవదే..!
నీ అడుగుల జాడ కదా..నా ధ్యాసే..బంగారూ..!
అలుక మాటు సుస్వరాల మధువొసగే జాణవులే..!
నీ జిలుగుల ఆట కదా..నా పరుగే..బంగారూ..!
ఆ'మాధవ'.. ఆ'రాధవు..నీవేనా ప్రియ సఖియా..!
నీ మెరుపుల మాల కదా..నా బాటే..బంగారూ..!